కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఇప్పట్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం చేయడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). తాజాగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు బలమైన సీట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘గుర్తులు లేని ఈ ఎన్నికల్లోనే బీఆర్ ఎస్ కు భారీగా సీట్లు ఇచ్చారు. ఒకవేళ రేపు గుర్తులు ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వన్ సైడ్ మెజార్టీ గులాబీ పార్టీకే వస్తుంది. కారు గుర్తు కనిపిస్తే ప్రజలంతా దానికే ఓటేస్తారు. ఆ భయం సీఎం రేవంత్ రెడ్డికి బాగా పట్టుకుంది. అందుకే ఇప్పట్లో ఆ ఎన్నికలు పెడుతాడని నేనైతే అనుకోవట్లేదు’ అంటూ చెప్పుకొచ్చారు హరీష్ రావు .
Read Also: జీ-రామ్-జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Follow Us On: Youtube


