కలం, వెబ్ డెస్క్ : కేసీఆర్ లేకపోతో తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి వయస్సున్న కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేయొచ్చా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేట్స్ మెన్ లా మాట్లాడితే రేవంత్ రెడ్డి వీధి రౌడిలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా గోదవారి నది జలాలు, రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తిట్లు తిట్టడం సరైంది కాదని హరీశ్ రావు అన్నారు.
నగర కాలుష్య నివారణకు కేసీఆర్ (KCR) ఫార్మాసిటీ కోసం భూమి సేకరిస్తే.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ వద్దని చెప్పాడన్నారు. రైతులకు భూములు వాపస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రైతులకు భూములు ఇవ్వకుండా రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని కేసీఆర్ ప్రశ్నించారని చెప్పారు. ఇప్పడు రైతుల భూములు వాపసు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని.. దీనిని కేసీఆర్ ప్రశ్నించారని హరీశ్ రావు(Harish Rao) తెలిపారు.
Read Also: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు.. జాన్వీకపూర్ సంచలన పోస్ట్
Follow Us On: Instagram


