కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని, దానికి సంబంధించిన జీవో, గెజిట్‌లను కూడా విడుదల చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే కార్మికులు (RTC Workers Strike) రోడ్డెక్కారని, రెండేళ్లు గడుస్తున్నా ఆ వాగ్దానాలు నెరవేరకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని విమర్శించారు.
‘మహాలక్ష్మి’ పథకం కింద ప్రభుత్వం ఆర్టీసీకి సుమారు రూ.3,000 కోట్ల బకాయిలు పడిందని, దీనివల్ల కార్మికులకు అందాల్సిన డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోయాయని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులతో చర్చలు జరపాలని, వారి న్యాయబద్ధమైన కోరికలను నెరవేర్చాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
Read Also: లీగల్ బ్యాటిల్ టు స్ట్రీట్ ఫైట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటెజీ…
Follow Us On: X(Twitter)

