స్కూళ్ల టెండర్లలో రేవంత్ భారీ కుంభకోణం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలిస్తే.. అన్నీ 4.86%, 4.96%, 4.99% ఎక్సెస్‌కే ఇచ్చారని అన్నారు. ఒక్క టెండర్ కూడా మైనస్‌కు పోకుండా అన్నీ ఎక్సెస్‌కే ఎలా పోయాయని ప్రశ్నించారు. ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా రూ.494 కోట్ల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యిందని ఆరోపించారు. నర్సంపేట ప్యాకేజ్-8 కింద రూ.136 కోట్లకు టెండర్ ఉంటే అది రూ.142 కోట్లకు (4.86% ఎక్సెస్) ఇచ్చారని తెలిపారు. తమకు అనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్‌గా పెట్టుకుని ఈ రూ. 500 కోట్ల దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీశ్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడని చెప్పారు. వాళ్లు తన మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని.. రద్దు చేయమంటుంది నేనే కదా! అంటూ వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>