కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో పాలన చేయడంతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫెయిల్ అయ్యారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలని కానీ దండయాత్ర చేస్తారా? అంటూ మండిపడ్డారు.
నాలుగు వేల మంది పోలీసులతో, గూండాలతో రేవంత్ రెడ్డి సిరిసిల్ల(Sircilla)పై దండయాత్రకు వెళ్లడంటూ ఫైర్ అయ్యారు. సిరిసిల్లకు కేటీఆర్ (KTR) ఎమ్మెల్యే అయ్యాక అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో స్థానిక ప్రజలను అడిగితే తెలుస్తుందని చెప్పారు. బిఫోర్ కేటీఆర్, ఆఫ్టర్ కేటీఆర్ అనే రీతిలో సిరిసిల్ల డెవలప్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని.. అది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యార్థుల భవిషత్తు అంధకారం అయిందని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాలేదని అన్నారు. పిల్లలకు కాలేజీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన 30 లక్షల మంది విద్యార్థుల చదువులు ఆగిపోయాయని అన్నారు.
సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్దకు వెళ్లి రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తాము దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి భట్టి విక్రమార్క భార్య 15 శాతం కమిషన్ అడుగుతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. దేశంలో 6 డీఏలు పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే అంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగులు సెక్రటేరియట్ కి వచ్చి ధర్నాలు చేసిన దాఖలాలు లేవని అన్నారు.
Also Read : ఇండి కూటమి కీలక తీర్మానాలు.. అక్టోబర్ 2 నుంచి సేవ్ డెమొక్రసీ మార్చ్
Follow Us On: X(Twitter

