Mobile Popup Ad
Mobile Popup Ad

హిందూ ఏక్తా యాత్ర కోసం అందరూ కదిలి రావాలని పిలుపు

కలం , కరీంనగర్ బ్యూరో: హనుమాన్ జయంతి ( మే 12 ) సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ ఏక్తాయాత్ర కోసం హిందూ బంధువులందరూ కదిలి రావాలని, యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర కోరారు. సోమవారం రోజున కరీంనగర్‌ (Karimnagar)లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌లో ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుందన్నారు.

హిందువుల సంఘటిత శక్తిని చాటేందుకు , లక్షలాదిమందితో జరిగే ఈ యాత్రకు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందని తెలిపారు. కరీంనగర్‌లో జరిగే భారీ ఆధ్యాత్మిక కార్యక్రమంగా హిందూ ఎక్తాయాత్ర కు ఖ్యాతి గుర్తింపు లభించిందన్నారు. గత 12 ఏళ్లుగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కరీంనగర్ నగరాన్ని కాషాయమయంగా మార్చుతూ .. ప్రతి ఏటా ఎంతో ఘనంగా , వైభవంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ నిర్వహిస్తున్నారని తెలిపారు. వైశ్య భవన్ నుండి ప్రారంభమై కరీంనగర్‌లోని ప్రధాన కూడళ్ల మీదుగా కొనసాగే ఈ యాత్ర అశేష హిందూ బంధువుల, వివిధ హిందూ సంఘాల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>