పవన్ కల్యాణ్ పై అన్నామలై ప్రశంసల వర్షం

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం కార్యాలయం వరుసగా ప్రత్యేక చాప్టర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో విడుదలైన చాప్టర్-6ను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆవిష్కరించారు.

ప్రజలు ఆయనకు కుటుంబసభ్యులు

ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే “పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్”కు పవన్ కళ్యాణ్ నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలను కేవలం ఓటర్లుగా లేదా పౌరులుగా కాకుండా.. తన సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.

భక్తులకు ఉపయోగకరంగా బస్సులు

తిరుపతి నుంచి తమిళనాడులోని పళని వరకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజుకు రెండు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు.

పవన్ మరిన్ని విజయాలు సాధించాలి

ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ నిజాయితీ, కరుణ, బాధ్యతతో వ్యవహరిస్తారని అన్నామలై పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా క్రమశిక్షణ, అంకితభావం, సేవా దృక్పథంతో ముందుకు సాగే నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. పవన్ కల్యాణ్ చేపడుతున్న ప్రజాసేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, ప్రజలకు ఉపయోగపడేలా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవా ప్రయాణంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని అన్నామలై అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>