కలం, జనగామ : జనగామ (Jangaon) మున్సిపల్ కౌన్సిలర్ ఇంటి ఎదుట హనుమాన్ మాలధారులు గురువారం రాత్రి ఆందోళనకు దిగారు. హనుమాన్ మాల వేసుకున్న భక్తుడిపై కౌన్సిలర్ భర్త దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ స్వాములు నిరసన వ్యక్తం చేశారు. 30 మందికి పైగా స్వాములు కౌన్సిలర్ ఇంటి వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. సమచారం అందుకున్న పోలీసులు పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా భక్తులను శాంతింపజేశారు. ఈ క్రమంలో శుక్రవారం జనగామ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలర్ భర్తపై ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు స్వాములతో మాట్లాడి ఘటనపై విచారణ చేపడతామని హామీనిచ్చారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Read Also: రేవంత్ బాటలో మోడీ.. ఆరు గ్యారంటీల జపం..
Follow Us On: Instagram

