జనగామ మున్సిపాలిటీ అక్రమాలపై సీఎంకు ఫిర్యాదు

కలం, జనగామ: జనగామ మున్సిపాలిటీలో (Jangaon Municipality) జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని మాల మహాసభ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షణలో ACB (అవినీతి నిరోధక శాఖ) లేదా CID తో విచారణ జరిపించాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.

మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. “ఎన్నికల ఖర్చులకు ఆడిట్ ఉండకపోవచ్చు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రూపాయికి ప్రజలకు లెక్క చెప్పాల్సిందే” అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల్లో కౌన్సిల్ ఆమోదం పొందిన అంశాలను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా అమలు చేశారో అధికారుల తీరును నిలదీశారు.

పక్కా ఆధారాలతో 9 పేజీల ఫిర్యాదు:

వార్త పత్రిక తోపాటు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన టౌన్ ప్లానింగ్ అక్రమాల పై కథనాలను ఆధారాలుగా చూపుతూ, మొత్తం 9 పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును, మరో 5 పేజీల వార్తా క్లిప్పింగ్స్‌ను జత చేసి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తాటి కుమార్ తెలిపారు. ప్రజల్లో జరుగుతున్న చర్చలు, వెలుగులోకి వచ్చిన వాస్తవాల ఆధారంగానే ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పురపాలక శాఖ (Jangaon Municipality) బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ ఫిర్యాదుపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పారదర్శకంగా విచారణ జరిగితే తప్పు చేసిన అధికారులు ఖచ్చితంగా శిక్షించబడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: త్వరలోనే 15 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>