18 నుంచి యువజన, క్రీడల వారోత్సవాలు: కలెక్టర్ చాహత్ భాజ్ పాయ్

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా యువతలో నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ నెల 18 నుంచి 23 వరకు యువజన క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మే 18న “ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ – మారథాన్, ఫిజికల్ లిటరసీ” కార్యక్రమాన్ని జిల్లా స్థాయి రన్‌తో ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

మే 19న “కెరీర్, స్కిల్ డెవలప్‌మెంట్ డే” సందర్భంగా యువతకు ఉపాధి, నైపుణ్యాలపై శిక్షణ పై అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. మే 20న “యూత్ లీడర్‌షిప్ సమ్మిట్ – లీడ్ విత్ విజన్, ఇన్‌స్పైర్ ది ఫ్యూచర్” పేరిట క్విజ్, పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మే 21న “ప్లే, పార్టిసిపేట్ స్పోర్ట్స్ డే”లో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. మే 22న “సర్వ్ అండ్ సపోర్ట్ యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ” కార్యక్రమం కింద క్రీడా మైదానాల శుభ్రత కార్యక్రమాలు చేపడతామన్నారు. మే 23న “ఉద్యోగ సాధన – కనెక్టింగ్ టాలెంట్ విత్ ఆపర్చునిటీస్” కార్యక్రమంలో భాగంగా ఈనెల 8న నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపిక అయిన వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. యువత ఈ వారోత్సవాల్లో చురుకుగా పాల్గొని అవకాశాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>