కలం, వరంగల్ బ్యూరో: కూతురు శుభకార్యం ఆహ్వాన పత్రికలు పంచడానికి వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ములుగు (Mulugu) జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకు చెందిన గొల్లెన సదయ్య (48) ఈ నెల 20 న కూతురి చీర కట్టించే శుభకార్యం నిశ్చయం చేసుకున్నాడు. ఈ రోజు బంధువులకు ఆహ్వాన పత్రికలో పంచేందుకు ములుగు జిల్లాలోని జంగాలపల్లికి వెళ్తుండగా లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

