కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనర్సింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ అధికారులు హనుమకొండ వడ్డేపల్లిలోని ఆర్వో కార్యాలయం మీద దాడులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ ఆస్తులను గుర్తించారు. అవినీతికి పాల్పడినందుకుగాను సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్ ను సస్పెండ్ చేశారు. రామనర్సింహారావుపై చర్యల కోసం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ సుభాషిణి కమిషనర్ కు నివేదిక సమర్పించారు. ఈ మేరకు రామ నర్సింహారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ ఆర్వో కార్యాలయంలో ఏక కాలంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడడటం, అక్రమ ఆస్తులు కలిగి ఉండటం సంచలనం రేపింది.
Read Also: సింగర్ మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్.. అడ్వకేట్‌కు ఆల్కహాల్ టెస్ట్
Follow Us On : WhatsApp

