‘శోభనం’ పేరుతో ఫ్లెక్సీ.. బాహుబలి గెటప్‌లో వరుడు, ఫొటో వైరల్

కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వెలిసిన ఓ వినూత్న ఫ్లెక్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ వైరల్‌గా మారింది. ములకలపల్లి మండలం నల్లివారం గూడెం గ్రామానికి చెందిన గోపి అనే యువకుడికి ఈ నెల 10న వివాహం జరిగింది. అతని స్నేహితులు శోభన మహోత్సవం సందర్భంగా ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. ఈ ఫ్లెక్సీలో వరుడి ఫోటోను బాహుబలి గెటప్‌లో ఎడిట్ చేసి ‘బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై.. సంసార జీవితానికి వెల్‌కం’ అంటూ రాసిన క్యాప్షన్ నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. స్నేహితుల అత్యుత్సాహంతో వెలిసిన ఈ ఫన్నీ ఫ్లెక్సీ ( Flexi) ఫోటోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>