కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లాలో ఆదివారం ఉదయం ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కమలాపూర్ (Kamalapur) మండలం ఉప్పల్ గ్రామంలో ప్రయాణిస్తున్న ఒక కారు హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు, బాధితుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

