ప్ర‌భాస్‌కి ధురంధ‌ర్ సినిమా చూపించిన వంగా.. రీజ‌న్ అదేన‌ట‌!

క‌లం, వెబ్ డెస్క్‌: బాలీవుడ్ మూవీగా రిలీజైన ధురంధ‌ర్ (Dhurandhar) సినిమా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌తో దూసుకెళ్తోంది. సామాన్య ప్రేక్ష‌కుల‌తో పాటు క్రికెట‌ర్లు, దేశంలోని అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు ఈ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. న‌టీన‌టులు, డైరెక్ట‌ర్‌ ప‌ని తీరుపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) ఈ సినిమాను చూశారు. స్టార్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్ర‌భాస్‌కు ద‌గ్గ‌రుండి ధురంధ‌ర్ 2 సినిమా చూపించారు. వంగా ప్ర‌భాస్‌కు ఈ సినిమా చూపించ‌డం వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని సినీ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. సందీప్ రెడ్డి వంగా, ప్ర‌భాస్ కాంబినేష‌న‌ల్‌లో స్పిరిట్ అనే మూవీ రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ ఇంత‌కు ముందు వ‌ర‌కు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఈ సినిమా ఒకెత్తు.. వంగా సినిమాల తీరే వేరు. వంగా సినిమాల్లో హీరోలు త‌మ జాన‌ర్‌, స్టైల్‌ను ప‌క్క‌న పెట్టి న‌టించాల్సిందే. ఇక ధురంధ‌ర్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ న‌ట‌న అత్య‌ద్భుత‌మ‌ని అంద‌రూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ర‌ణ్‌వీర్ సింగ్ ప‌ని తీరు నుంచి ఇన్‌స్పైర్ అయ్యేందుకే ప్ర‌భాస్‌కు వంగా ఈ సినిమా చూపించి ఉంటాడ‌ని చ‌ర్చ న‌డుస్తోంది. కోకాపేటలోని అల్లు సినిమాస్ థియేటర్‌లో ప్ర‌భాస్‌, వంగా ధురంధర్-2 సినిమా చూశారు. థియేట‌ర్‌లో వీరు సినిమా చూస్తున్న ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>