కలం, మెదక్ బ్యూరో: మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) పేరిట ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంటూ చేస్తున్న ప్రచారం బోగస్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు హరీష్ రావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు గత రెండేళ్లు ఓపిక పట్టి సమ్మెకు దిగారని, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని వివరించారు. హైదరాబాద్ లో RTC ప్రయివేట్ పరం అవుతుందని, ఆర్టీసీని కాపాడుకోవడానికి డ్రైవర్లు ఎంతగానో కష్టపడుతున్నారని చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం మధ్య సఖ్యత లేనట్లు ఉందన్నారు. నాడు రేవంత్ రెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు డిపోల చుట్టూ తిరిగి చెప్పినవి వాస్తవం కాదా.. అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం ఉధృతం అవుతుందన్నారు. సమ్మెను దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు.
Read Also: లీగల్ బ్యాటిల్ టు స్ట్రీట్ ఫైట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటెజీ…
Follow Us On: X(Twitter)

