Mobile Popup Ad
Mobile Popup Ad

వైరాలో ఏసీబీకి చిక్కిన ఆర్టీఏ అధికారి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వైరా (Wyra) రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ (ACB) డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇటుకల వ్యాపారి వద్ద నుంచి ఆర్టీఏ అధికారి నగదు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రవాణా శాఖ కార్యాలయానికి ఇటుకల వ్యాపారి ద్వారా ఏసీబీ అధికారులే నగదు పంపించారు. ఆర్టీఏ అధికారికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న శేఖర్ అనే వ్యక్తికి నగదు ఇస్తుండడాన్ని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆర్టీఏ అధికారి వర ప్రసాద్‌, శేఖర్ పై కేసులు నమోదు చేశారు. వరప్రసాద్ నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.

Read Also: గ్యాస్ సిలిండర్లపై మళ్లీ షాక్.. చమురు సంస్థల షాకింగ్ నిర్ణయం

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>