కామారెడ్డిలో వడగండ్ల వర్షం.. ఆందోళనలో అన్నదాతలు

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం ప్రారంభమైంది.. ఆపై వడగండ్ల వాన కురిసింది. గాలుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వండగండ్ల వానతో మామిడి పంటలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>