భవనాల్లో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి: GWMC కమిషనర్

కలం, వరంగల్: నగరంలోని పెద్ద భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు (Fire Safety Measures) తప్పనిసరిగా కల్పించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ (GWMC Commissioner) టి.వెంకన్న సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం హనుమకొండలోని డీమార్ట్, వరంగల్‌లోని బిల్లా ఓపెన్ మైండ్ పాఠశాల, బాలసముద్రంలోని కళ్యాణి ఆసుపత్రి, నక్కలగుట్టలోని అసుక భవన్‌లను ఆయన తనిఖీ చేశారు.

అగ్నిమాపక పరికరాల పనితీరు, అత్యవసర మార్గాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పరికరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, అత్యవసర మార్గాల్లో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవన యజమానులు భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఆయన వెంట అగ్నిమాపక భద్రతా అధికారి రాజేశ్వర్ రావు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>