కలం, జోగులాంబ గద్వాల: రాజోలి మండలం తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న(Illegal Sand Transportation) మూడు మినీ టిప్పర్లను ఆర్టీఓ అధికారులు అర్ధరాత్రి పట్టుకుని సీజ్ చేశారు. రాజోలి శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడ్‌తో వెళ్తున్న వాహనాలను అధికారులు అడ్డుకున్నారు.
పట్టుబడిన మూడు వాహనాల్లో ఒకదానికి మాత్రమే(TS33T5953) నంబర్ ప్లేట్ ఉండగా, మిగిలిన రెండింటికి నంబర్ ప్లేట్లు లేవు. వాహనాలను సీజ్ చేసి రాజోలి పోలీస్ స్టేషన్‌కు తరలించగా పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాత్రి వేళల్లోనూ తనిఖీలు కొనసాగిస్తామని ఆర్టీఓ అధికారి చరణ్ హెచ్చరించారు.

