Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో కాల్పుల కలకలం: PMJ జ్యువెలరీలో భారీ దోపిడీ!

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం దోపిడీ ముఠా బీభత్సం సృష్టించింది. జ్యోతినగర్‌లోని ప్రముఖ పీఎంజే జ్యువెలరీ (PMJ Jewellery) షోరూమ్‌లోకి కస్టమర్ల ముసుగులో చొరబడిన ఐదుగురు దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. అడ్డువచ్చిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలోనే షోరూమ్‌లోని బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం రెండు మోటార్ సైకిళ్లపై అక్కడి నుండి పరారయ్యారు.

నగర (Karimnagar) నడిబొడ్డున పట్టపగలే గన్ సౌండ్ వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు పారిపోయే క్రమంలో కంగారులో వదిలేసిన ఒక తుపాకీ మ్యాగజైన్, బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దోపిడీకి గురైన బంగారం విలువ ఎంత అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Read Also: సముద్రంలో గర్భంలో త్రివర్ణ పతాకం: భారత్‌ గిన్నిస్ రికార్డు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>