కలం, వెబ్ డెస్క్: భారత పైలట్ స్మిత్ మచ్ఛర్ (Pilot Smit Machchhar)పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని తోటి పైలట్ కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా.. కత్తిపోట్లకు గురైనా ధైర్యసాహసాలు ప్రదర్శించి 180 మంది ప్రాణాలు కాపాడటంపై సోషల్ మీడియాలో లక్షల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. పైలట్ స్మిత్ స్వస్థలం గుజరాత్ కాగా ప్రస్తుతం కుటుంబంతో కలిసి యూఏఈలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం ‘విశిష్ఠ్ గుజరాత్ గరిమా అవార్డు(Vishisht Gujarat Garima Award)’ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం భూపేష్ బఘేల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. స్మిత్ మచ్ఛర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగానే వందల మంది ప్రాణాలతో బయటపడినట్లు ప్రశంసించారు.
సౌదీ నుంచి దుబాయ్‌కు తరలింపు..
పైలట్ స్మిత్ మచ్ఛర్(Pilot Smit Machchhar)ను మరింత మెరుగైన చికిత్స కోసం సౌదీ నుంచి దుబాయ్ తరలించినట్లు ఫ్లై దుబాయ్ సంస్థ పేర్కొంది. హై జాకింగ్ ఘటన తరువాత సౌదీలోని తబుక్ విమానాశ్రయంలో సేఫ్ ల్యాండింగ్ అనంతరం.. మచ్ఛర్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎనిమిది కత్తి పోట్లకు గురైన స్మిత్ మచ్ఛర్‌కు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తదనంతరం చికిత్స కోసం ఆయన్ను ప్రత్యేక విమానంలో దుబాయ్ తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన పైలట్‌ను ఇప్పటికే సౌదీ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఇజ్రాయెల్ కూడా ఉగ్ర కోణంలో దర్యాప్తు చేస్తోంది. మచ్ఛర్ కోలుకుని వివరాలు చెబితేనే.. అసలు ఏం జరిగిందనేది తెలుస్తుందని ఫ్లై దుబాయ్ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
Also Read : అలా మార్చడానికి మీరెవరు?: రాహుల్ గాంధీ
Follow Us On: X(Twitter)

