చిన్నారిని ఢీకొట్టిన స్కార్పియో.. సినిమా స్టైల్​ లో ఛేజ్​..!

కలం, వెబ్​ డెస్క్​ : అస్సాంలోని కర్బీ అంగ్‌లాంగ్ జిల్లా డోక్మోకా ప్రాంతంలో ఓ బ్లాక్ స్కార్పియో చిన్నారిని ఢీకొట్టి ఆగకుండా దూసుకెళ్లింది. గమనించిన పోలీసులు వాహనాన్ని ఛేదించారు (Assam Scorpio Chase). స్కార్పియో టైర్ పూర్తిగా పేలిపోయినా డ్రైవర్ వాహనాన్ని ఆపలేదు. మెటల్ రిమ్‌పైనే కిలోమీటర్ల మేర వాహనాన్ని నడుపుతూ దారిలో పలు వాహనాలను ఢీకొట్టాడు.

ఈ క్రమంలో పోలీసులు, స్థానికులు వాహనాన్ని చేదించి నాగావ్ జిల్లాలో అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి నిలిపివేశారు. దాదాపు 40 కిలోమీటర్ల పాటు సాగిన ఈ ఘటన సినిమా స్టైల్​ ఛేజ్​ (Assam Scorpio Chase) ను తలపించింది. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>