కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. కొత్త ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన ఫారం–6లో ఎలాంటి మార్పులు చేసినా.. రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. అయినా, ఫారంలో అనేక మార్పులు చేర్పులు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందన్నారు. అలా చేయడానికి మీరెవరు అంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar)ను ఉద్దేశించి పరోక్షంగా ప్రస్తావించారు.
ఫారం–6లో మార్పులు చేయడంపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం చెప్పిన విషయాన్ని రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుర్తు చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌తో కలిసి ఫారం–6లో మార్పులు చేర్పులు చేసేందుకు ఈసీ ఒప్పందం కుదుర్చుకుంటోందన్నారు. ‘ఇలా చేయమని ఎవరు ఆదేశించారు..? టీసీఎస్‌తో ఒప్పందంపై ఎవరు సంతకం చేశారు..? అలా చేయాలని ఎవరైనా బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారా..?’ అని ప్రశ్నలు గుప్పించారు.
మహారాష్ట్రకు రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. బాల్ఘాట్లో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ‘బీజేపీ పాలనలో గిరిజన జాతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అసమర్థత కారణంగా.. గిరిజన పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడి మరణించారు. వారిని పరామర్శించేందుకు బాల్ఘాట్ వచ్చాను. కొద్ది రోజుల కిందట నేను కెన్–బెత్వా ఉద్యమంలో పాల్గొన్న గిరిజన సోదరులను కలిశాను. ఆ ప్రాజెక్ట్ కారణంగా వారు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. సరైన పరిహారం, పునరావాసం మాత్రం దక్కడం లేదు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారు ప్రభుత్వాలను నడిపిస్తుండటంతో గిరిజనునల భవిష్యత్తు నాశనం అవుతోంది’ అని రాహుల్ విమర్శించారు.
Also Read : దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Youtube

