గ్రేటర్‌ హైదరాబాద్‌‌‌కు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు

కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలోని మూడు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక సంవత్సరానికిగాను ఆస్తి పన్ను (Tax Collection) వసూళ్లలో రికార్డును సృష్టించాయి. గడచిన ఏడాది రూ.2,038 కోట్ల పన్ను వసూలు కాగా, ఈ ఏడాది ఏకంగా రూ.500 కోట్ల అదనపు ఆదాయంతో మొత్తం వసూళ్లు రూ.2,556 కోట్లకు చేరాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన నిన్న ఒక్కరోజే రూ.150 కోట్ల మేర పన్ను జమ కావడం విశేషం. అధికారుల సమర్థవంతమైన ప్రణాళికలు, ప్రజల నుంచి వచ్చిన స్పందనతో కార్పొరేషన్ల ఖజానాకు భారీగా నిధులు సమకూరినట్లు తెలుస్తోంది.

కార్పొరేషన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే.. సైబరాబాద్ కార్పొరేషన్ రూ.1,000.36 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, జీహెచ్ఎంసీ పరిధిలో రూ.995.82 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే మల్కాజ్‌గిరి కార్పొరేషన్ నుంచి రూ.562 కోట్ల ఆదాయం లభించింది. ఐటీ కారిడార్ విస్తరణ, కొంత మేర రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో సైబరాబాద్ పరిధిలో వసూళ్లు గణనీయంగా పెరిగాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: కేసీఆర్ డైలాగ్ చెప్పిన కవిత

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>