శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం

కలం, వరంగల్ బ్యూరో: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (RTC Driver Shankar Goud)  ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నర్సంపేట వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాలు శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటనతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణసాయంగా రూ.10 లక్షలు, ఎమ్మెల్యే సహాయనిధి నుంచి రూ.5 లక్షలు అందజేయనున్నట్లు నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి ప్రకటించారు. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పించడంతో పాటు, ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>