Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్టీఆర్ జిల్లా పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్ బోర్డులు!

క‌లం వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త‌ల‌తో ప‌లు దేశాల్లో కొన్ని రోజుల పాటు చ‌మురు కొర‌త (Fuel Crisis) ఏర్ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఇండియాలో సైతం సోష‌ల్ మీడియా దుష్ప్ర‌చారంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. మ‌ళ్లీ పెట్రోల్ , డీజిల్ దొర‌క‌దేమోనంటూ కొద్ది రోజుల పాటు పెట్రోల్ బంకుల ముందు క్యూ క‌ట్టారు. ప్ర‌భుత్వం, పోలీసులు ప‌లుమార్లు చ‌మురు ల‌భ్య‌త‌పై క్లారిటీ ఇచ్చిన త‌ర్వాత ఈ క్యూలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఇక తాజాగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని పెట్రోల్ బంకుల్లో మ‌ళ్లీ నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి.

నందిగామలోని (Nandigama) ప‌లు బంకుల్లో నో డీజిల్.. నో స్టాక్ అంటూ బంక్ య‌జ‌మానులు బోర్డులు పెట్టేశారు. డీజిల్ దొరక్క‌పోవడంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొన్ని బంకుల్లో పెద్ద‌ల రిక‌మండేష‌న్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ పోస్తాంటున్నారు. ఇక ఈ రిక‌మండేష‌న్లు ఉన్నా ఫుల్ ట్యాంక్ చేయ‌డం లేదు. దీంతో పెట్రోల్ బంక్ య‌జ‌మానులు కావాల‌నే కృత్రిమ కొర‌త సృష్టిస్తున్నార‌ని వాహ‌న‌దారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో డీజిల్ ధరలు పెరుగుతాయన్న వార్త‌ల‌తో స్టాక్ ఉన్నా కూడా డీజిల్ కొట్టడం లేద‌ని ఆరోపిస్తున్నారు.

Read Also: బిట్స్ పిలానీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>