గచ్చిబౌలిలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేకంగా నిర్వహించిన ‘ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్’ సైకిల్ ర్యాలీ (Bicycle Rally) ని లాంఛనంగా ప్రారంభించారు. ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, క్రీడా శాఖ అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రోజుకు అరగంట వ్యాయామం అనే నినాదంతో ప్రజల దైనందిన జీవితంలో సైక్లింగ్‌ను భాగం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైక్లింగ్‌ను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మారుతున్న జీవనశైలిలో సైక్లింగ్ చేస్తే ఆరోగ్యకర జీవనాన్ని గడుపుతారని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>