తెలంగాణ గవర్నర్‌ కీలక నిర్ణయం.. కాన్వాయ్ తగ్గింపు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన పొదుపు కోసం లోక్ భవన్‌లో వాహనాల వినియోగాన్ని 50 శాతం తగ్గిస్తూ గవర్నర్ నిర్ణయించారు. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం దృష్ట్యా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లోనూ వాహనాల వాడకాన్ని నియంత్రించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అటు సీఎం రేవంత్ సైతం కాన్వాయ్‌లో వాహనాలను కుదింపు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం 9 వాహనాలతో సీఎం కాన్వాయ్ కొనసాగుతోంది. దీన్ని మూడింటిక తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మంత్రుల కాన్వాయ్ సైతం తగ్గంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చమురు వినియోగం సాధ్యమైనంత తగ్గించాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. వర్క్ ఫ్రం హోం బెటర్ ఆప్షన్ అని దేశ ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనాన్ని పొదుపు చేసే ప్రయత్నంలో భాగంగా స్వయంగా దేశ ప్రజలకు ప్రధాని ఆదర్శంగా నిలిచారు. ప్రధాని మోదీ తన అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించారు. ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం.

Read Also: టీఎంసీ నేత ఇంట్లో విస్తుపోయే దృశ్యాలు.. బంగారు బెడ్​, భారీ ఆస్తులు సీజ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>