సీఎం కాన్వాయ్ సైజ్ తగ్గింపు.. ఇప్పుడు ఎన్ని వాహనాలంటే

కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్ (CM Revanth Convoy) సైజు తగ్గింది. ఇప్పటివరకూ తొమ్మిది వాహనాలు ఉండగా దీన్ని మూడింటిక తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ పొదుపు సూత్రం పిలుపుకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మంత్రుల కాన్వాయ్ సైతం తగ్గంచే అవకాశాలున్నాయి. ఇప్పటికే గవర్నర్ తన కాన్వాయ్ సైజును సగానికి తగ్గించుకున్నారు. ఆఫీసర్లు వాడే వాహనాల్లో సైతం ఈవీలు ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే అద్దె వాహనాలలో ఈవీ లు ఉండాలాని సీఎం ఇప్పటికే సూచించారు. పెట్రోలు, డీజిల్ పరిమిత వినియోగంపై ప్రధాని చేసిన సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నది.

Read Also: పొదుపు బాటలో ఢిల్లీ ప్రభుత్వం.. వర్క్ ఫ్రమ్ హోం, కాన్వాయ్‌పై కీలక నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>