కలం, వెబ్ డెస్క్: 14 రీల్స్ ప్లస్, ఈరోస్ మధ్య ఆర్థిక సమస్యల కారణంగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అఖండ 2 (Akhanda 2) విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కోర్టు కేసు కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోయాయి. మంగళవారం మద్రాస్ హైకోర్టు ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా అఖండ 2 డిసెంబర్ 12న తెరపైకి రానుంది.
మంగళవారం సాయంత్రం నాటికి నిర్మాతల నుంచి అధికారిక ధృవీకరణ వెలువడే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అనుమతి పొందిన తర్వాత ఏపీ, తెలంగాణలో ప్రీమియర్ షోలు పడే అవకాశాలున్నాయి. డిసెంబర్ 4న చివరి నిమిషంలో వాయిదా పడటంతో నిరాశ చెందిన బాలయ్య అభిమానుల్లో ఈ వార్త ఆనందం నింపింది.
బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు భారీ క్రేజ్ ఉంది. భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టే అవకాశాలున్నాయి. గత సినిమాల మాదిరిగా అఖండ 2 (Akhanda 2) ఆకట్టుకుంటే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించవచ్చు. విడుదల తేదీ ఫిక్స్ కావడంతో ప్రస్తుతం అఖండ 2కి కావలసిందల్లా పాజిటివ్ టాక్ మాత్రమే.
Read Also: జపాన్ లో భూకంపం.. ప్రభాస్ సేఫ్టీపై డైరెక్టర్ క్లారిటీ
Follow Us On: X(Twitter)


