Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ కు గుడ్ న్యూస్.. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది..!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోయాయి. విజయ్ (Vijay) సారథ్యంలోని టీవీకేకు వీసీకే పార్టీ బేషరుతుగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మద్దతు లేఖను టీవీకేకు అందజేసింది. టీవీకేకు మద్దతు ఇస్తూ వీసీకే నేత తిరుమావళవన్ అందించిన లేఖను టీవీకే నేత అదవ అర్జున్ తీసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 సీట్లు గెలుపొందాయి. దీంతో వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన 118 సీట్ల సంఖ్యాబలం టీవీకే ప్రభుత్వానికి లభించినట్లైంది.

ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ వీసీకే కార్యాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా మద్దతు ఇచ్చిన వీసీకేకు విజయ్ కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. వీసీకే మద్దతు ఇచ్చిన వేళ మరోసారి గవర్నర్ అపాయింట్‌మెంట్ ను విజయ్ కోరారు. వీసీకే ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని లోక్ భవన్ కు బయలుదేరనున్న విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ ను కోరనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>