కలం, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వెళ్లిన బంగారం, వెండి ధరలు (Gold Silver Prices) వరుసగా రెండు మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.9 వేలకు పైగా పడిపోయింది. మరోవైపు వెండిది కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కిలో వెండి ధర ఒక్క రోజే రూ.20 వేలకు పడిపోయింది. హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Price) ఆదివారం రూ.1,60,50 ఉండగా సోమవారం రూ.9,050 తగ్గి ప్రస్తుతం రూ.1,51,530గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold) ఆదివారం రూ.1,47,200 ఉండగా సోమవారం రూ.8,300 తగ్గి ప్రస్తుతం రూ.1,38,900గా ఉంది. ఇక బంగారానికి గట్టి పోటీ ఇస్తూ వేగంగా నాలుగు లక్షల ధర దాటి వెళ్లిన వెండి మళ్లీ అంతే వేగంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం కిలో వెండి ధర (Silver Prices) రూ.3,20,000 ఉండగా సోమవారం ఏకంగా రూ.20,000 తగ్గి ప్రస్తుతం రూ.3,00,000గా ఉంది.
Read Also: పసుపు పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
Follow Us On: Pinterest

