కలం, సినిమా : సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నట సింహం బాలకృష్ణ (Balakrishna), కింగ్ నాగార్జున (Nagarjuna), విక్టరీ వెంకటేష్(Venkatesh). ఈ నలుగురు హీరోలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. నేటికీ డిఫరెంట్ స్టోరీస్‌తో ఆడియన్స్‌ని ఎంటర్ టైన్ చేస్తూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సీనియర్స్ నెక్ట్స్ సినిమాల విషయంలో టార్గెట్ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మన శంకర్ వరప్రసాద్ గారు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నెక్ట్స్ మూవీని బాబీతో చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఈ మూవీ భారీ కాస్టింగ్‌తో.. భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా.. చిరు డాటర్ గా కృతి శెట్టి లేదా కీర్తి సురేష్ నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని నెక్ట్స్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
ఇక బాలయ్య.. మలినేని గోపీచంద్ తో సినిమా చేస్తున్నారు. ఇది గ్యాంగ్‌స్టర్ మూవీ. ముందుగా వీరి కాంబోలో హిస్టారికల్ మూవీ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో కథను మార్చేశారు. దీని వలన సెట్స్ పైకి వెళ్లడం లేట్ అవుతుంది. అందుచేత ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంకీ, అనిల్ రావిపూడి మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగ్ తన 100వ సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. 2027 సంక్రాంతి సీనియర్స్ సంక్రాంతి అవుతుంది. అయితే.. నాగ్ 100వ సినిమాని సంక్రాంతికి కాకుండా ఈ ఇయర్ లో దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.


