బంగారం ధర(Gold Prices) తగ్గుతుంది అని ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగులుతోంది. సామాన్యులు బంగారం వైపు చూడాలంటేనే భయపడేలా పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 21న చరిత్రలోనే తొలిసారిగా లక్ష మార్క్ దాటిన బంగారం ధర.. తగ్గు ముఖం చూడట్లేదు. తాజాగా 3 రోజుల్లోనే రూ.3 వేలకుపైగా పసిడి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా 23 వేల520 కి చేరుకోగా… 22 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా 10 వేల700 కి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.లక్షా 50వేలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా సుంకాల పెంపు, యుద్ధ పరిస్థితుల వల్ల పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

