Mobile Popup Ad
Mobile Popup Ad

పంట పొలంలో గుప్తనిధులు.. చెన్నరావుపేటలో బంగారం కలకలం!

కలం, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లా చెన్నరావుపేట (Chennaraopet) మండలం కోపాకులపాడు గ్రామంలో వింత ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అనే రైతుకు ఉన్న ఆరు ఎకరాల పంట భూమిని బాలు అనే రైతు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల పొలం దున్నుతుండగా అకస్మాత్తుగా బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. పొలంలో బంగారం దొరకడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న కూలీలకు, కౌలు రైతు బాలుకు మధ్య వాటాల విషయమై పెద్ద వివాదం రేగింది. ఈ వ్యవహారం కాస్తా రచ్చకెక్కడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.

ఈ పొలంలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా ఇక్కడ గుప్తనిధులు లభ్యమయ్యాయనే ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బంగారం పంచాయతీ కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. అయితే ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. సుమారు ఆరేళ్ల క్రితం ఇదే భూమిని అమ్మేసిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. ఆ భూమి ఒకప్పుడు తనదే కాబట్టి, అందులో దొరికిన బంగారంలో తనకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

మరోవైపు ఈ పొలంలో మరిన్ని బంగారు నిధులు నిక్షిప్తమై ఉండవచ్చనే ప్రచారం జోరందుకోవడంతో, వచ్చే ఏడాది ఆ భూమిని కౌలుకు తీసుకోవడం కోసం స్థానిక రైతులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతానికి ఈ గుప్తనిధుల లభ్యం, వాటాల గొడవపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>