కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) పట్టణంలోని కూడళ్లలో సిగ్నల్స్ లైట్లు వెలగడం లేదు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ లైట్స్ పనిచేయాలంటే మళ్ళీ సీఎం రావాలా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పాల్వంచలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆదివారం 34వ డివిజన్ కార్పొరేటర్ బట్టు విజయలక్ష్మి కుమారుడు అఖిల్ నందన్ ద్విచక్ర వాహనాన్ని, వేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. అంతకుముందు ఇదే రోడ్డుపై ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి.
కూడళ్ల దగ్గర సిగ్నల్ లైట్లు (Traffic Lights) సరిగ్గా పని చేయకపోవడంతో వాహనదారులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సిగ్నల్స్ పనిచేసి ఉంటే, వేగ నియంత్రణ ఉండి ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే సిగ్నల్ లైట్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణ (Palwancha) ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
Follow Us On: Instagram

