బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: గత కొద్ది నెలల క్రితం అనూహ్యంగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు (Gold – Silver Prices).. గత కొద్ది రోజులుగా తగ్గుతూ పుత్తడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. ఒకానొక సమయంలో దాదాపు రూ.2 లక్షల మార్క్ ను చేరుకున్న బంగారం ధరలు.. తాజాగా తగ్గుముఖం పడుతూ సామాన్యులకు ఆశలకు ఊపిరిపోస్తున్నాయి. కాగా, గత వారంలో గోల్డ్ రేటు హెచ్చుతగ్గులకు గురైంది. మొత్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 5,950 మేర తగ్గింది.

తాజాగా నవంబర్ 16, సోమవారం రోజున సైతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,36,800కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.750 తగ్గి రూ.1,25,400 గా ఉంది. అటు కేజీ వెండి ధర భారీగా తగ్గింది. ఆదివారం రూ.1,95,000 ఉన్న కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 తగ్గి రూ.1,90,000 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే ఈ ధరలపై 3 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది.

Also Read : ‘మేం విడిపోతున్నాం..’ ఇన్‌స్టాలో మంత్రి భార్య పోస్ట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>