‘మేం విడిపోతున్నాం..’ ఇన్‌స్టాలో మంత్రి భార్య పోస్ట్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడాకుల వార్త‌లు మ‌రువ‌క ముందే సౌత్ ఇండియాలో మ‌రో ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు విడాకుల దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మిళ‌నాడు మంత్రి ఆధ‌వ్ అర్జున (Aadhav Arjuna), త‌న భార్య డైసీ మార్టిన్‌ (Daisy Martin )త‌మ వివాహ బంధానికి ముగింపు ప‌ల‌క‌బోతున్నారు. ఈ విష‌యాన్ని డైసీ త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. వీరిద్ద‌రికి 14 ఏళ్ల క్రితం 2012లో పెళ్లి జ‌రిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. డైసీ సోమవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఇందులో పరస్పర అంగీకారంతో తాము భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ ఇద్ద‌రి జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. తాము భార్యా భ‌ర్త‌లుగా విడిపోయినా తమ కొడుకు సంతోషం, భవిష్యత్తు కోసం తల్లిదండ్రులుగా కలిసి బాధ్యతలు నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు.

డైసీ మార్టిన్ లాటరీ వ్యాపార దిగ్గజం శాంటియాగో మార్టిన్ కుమార్తె. ఆమె కూడా ప్ర‌స్తుతం వ్యాపారవేత్తగా ఉన్నారు. ఆరిస్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మహిళా సాధికారతతో పాటు అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఆధవ్ అర్జున తమిళనాడులో ప్రభుత్వంలో క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆధవ్‌పై తనకు ఎంతో గౌర‌వం ఉంద‌ని, ఆయన భవిష్యత్తులో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని కూడా డైసీ త‌న పోస్టులో తెలిపారు. ఈ సమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అంద‌రినీ కోరారు. అయితే వీరిద్ద‌రి విడాకుల‌కు స్ప‌ష్ట‌మైన కార‌ణాలు ఏవీ తెలియ‌రాలేదు. దీంతో ఆధ‌వ్ అనుచ‌రులు, నెటిజ‌న్లు ఈ విడాకుల‌పై ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>