epaper
Wednesday, February 18, 2026
epaper

నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని హత్య చేసిన యువతి

కలం, వెబ్ డెస్క్:  నంబర్ బ్లాక్ చేశాడనే కారణంతో ఓ యువతి తన ప్రియుడిని హత్య చేసింది (Girlfriend Kills Boyfriend). ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బిలాస్‌పూర్‌లో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోషిణి అనే యువతికి ఇన్ స్టా ద్వారా ప్రసాద్ సూర్యవంశి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ గొడవ అనంతరం ప్రసాద్ సూర్యవంశీ, రోషిణి మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీనితో తీవ్ర కోపానికి గురైన రోషిణి, ప్రసాద్‌ను కలిసేందుకు వెళ్లింది. అక్కడ మరోసారి మాటా మాటా పెరిగి, ఆగ్రహంతో ఆమె కత్తితో ప్రసాద్‌పై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితురాలు రోషిణిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Chhattisgarh
Chhattisgarh

Read Also: రూ.15 ల‌క్ష‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఈ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>