కలం, వెబ్ డెస్క్: ఏసీబీ (ACB) అధికారులకు మరో అవినీతి అధికారి పట్టుబడ్డాడు. ఓ పని విషయంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జీహెచ్ఎంసీ(GHMC) కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి ఓ వ్యక్తి నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారణ చేపట్టారు.
Read Also: పీఆర్సీ… రెండున్నరేళ్లు దాటినా నో ప్రోగ్రెస్
Follow Us On: Sharechat


