epaper
Wednesday, February 18, 2026
epaper

నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ ప్రభంజనం.. వ్యూస్‌లో వరల్డ్ రికార్డ్

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లతో రికార్డులు సృష్టించిన రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar). ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనూ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. ధురంధర్ ఈ వారం టాప్ 10 గ్లోబల్ మూవీస్ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం ఏకంగా 7.6 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేయడమే కాకుండా.. మొత్తం 26.1 మిలియన్ గంటల వ్యూస్ సమయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 3 గంటల 26 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఈ స్పై థ్రిల్లర్‌ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇండియాతోపాటు పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోనూ ‘ధురంధర్’ (Dhurandhar) నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. గల్ఫ్ దేశాలైన ఖతార్, బహ్రెయిన్, ఒమన్, యూఏఈ (UAE) లలో కూడా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ చార్ట్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు, ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం ‘తేరే ఇష్క్ మే’ కూడా టాప్ 10 జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

Read Also: బాబాయ్ కోసం తగ్గిన అబ్బాయ్.. రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>