కలం, వెబ్ డెస్క్ : గిగ్ వర్కర్లు (Gig Workers) మరోసారి సమ్మె బాట పట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్లు నిరసన చేపట్టనున్నారు. పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా సాయంత్రం 5 గంటల వరకు యాప్ ఆధారిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. పెట్రో ధరలు పెరగడంతో డెలివరీ, రవాణా కార్మికులకు కిలోమీటర్ కు కనీసం రూ.20 చెల్లించాలని గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ సమ్మె నిర్ణయం తీసుకుంది.
Read Also: పోక్సో కేసు.. లొంగుబాటలో బండి భగీరథ్..!
Follow Us On: WhatsApp

