Mobile Popup Ad
Mobile Popup Ad

పోక్సో కేసు.. లొంగుబాటలో బండి భగీరథ్..!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణతో సహ కేంద్ర రాజకీయాల్లో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ (Bandi Bhagirath) పోక్సో కేసు తీవ్ర దుమారం రేపుతోంది. మైనర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈనెల 9న పోక్సో కేసు నమోదైన నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన భగీరథ్ (Bandi Bhagirath).. పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంధ్యంతర బెయిల్ ఇవ్వాలని భగీరథ్ తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎలాంటి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైకోర్ట్ లో ఊరట లభించకపోవడంతో పోలీసులకు లొంగిపోక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే, ఇప్పటికే కుమారుడిని దాచిపెట్టి డ్రామా చేస్తున్నారంటూ కేంద్ర బండి సంజయ్ పై ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

మరోవైపు నిన్న (గురువారం) భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోతున్నాడనే ప్రచారం ఉదయం నుంచి సాగుతోంది. ఈ నేపథ్యంలో కొంపల్లి లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే, లొంగుబాటుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>