నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, క్యాన్ల‌తో ఎగబడ్డ జనం!

క‌లం, వెబ్‌డెస్క్: క‌డ‌ప (Kadapa) జిల్లాలోని కొండాపురం మండలం అనంతపురం గ్రామం సమీపంలో ఒక నెయ్యి ట్యాంకర్ (Ghee Tanker) ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన విషయం తెలియగానే స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి వ‌చ్చారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వాళ్ల‌కు స‌హాయం చేయ‌డానికి వ‌చ్చార‌నుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే.. వాళ్లు వ‌చ్చింది ట్యాంకులో నుంచి కింద ప‌డ్డ నెయ్యి కోసం… ప్ర‌మాదంతో ట్యాంకర్ నుంచి నెయ్యి బయటకు కారుతుండటంతో జనం బిందెలు, బకెట్లు, చెంబులతో నెయ్యిని పట్టుకోవడానికి ఎగబడ్డారు.

డ్రైవర్, క్లీనర్ గాయాలతో ఉన్నా వాళ్ల‌ను ప‌ట్టించుకోకుండా రోడ్డుపై పారుతున్న నెయ్యిని బ‌కెట్ల‌లో నింపుకోవ‌డంలో జ‌నం నిమ‌గ్న‌మ‌య్యారు. దీంతో ఆ ప్రాంతంలో కొంత‌సేపు ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. జ‌నం నెయ్యి ప‌ట్టుకెళ్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read Also: నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, క్యాన్ల‌తో ఎగబడ్డ జనం!

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>