epaper
Wednesday, February 18, 2026
epaper

నకిలీ హిమాలయ ‘లివ్​.52’ ట్యాబ్లెట్స్ తయారీ ముఠా అరెస్ట్​

కలం, వెబ్​డెస్క్​: పారా హుషార్​. షాపుల్లో ట్యాబ్లెట్స్​ కొనేటప్పుడు జాగ్రత్త. అసలైనవి ఏవో, నకిలీ ఏవో జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటమాడే మోసగాళ్లు నకిలీ ట్యాబ్లెట్స్​ను మార్కెట్​లోకి వదులుతున్నారు. గమనించకుండా వీటిని కొని, వాడితే ఉన్న రోగాలు పోవడం కాదు, కొత్తవి వస్తాయి. ఇలాంటి నకిలీ ట్యాబ్లెట్స్​ వ్యవహారం ఒకటి ఉత్తరప్రదేశ్​లో పోలీసులు బయటపెట్టారు. భారీ స్థాయిలో నకిలీ లివ్​.52 (Himalaya Liv 52) మాత్రలు తయారుచేస్తున్న ఓ ముఠాను అరెస్ట్​ చేశారు.

వివరాలివీ.. తాము తయారుచేసే ‘లివ్​.52’ ట్యాబ్లెట్స్​కు నకిలీవి తయారుచేసి మార్కెట్లో కొందరు అమ్ముతున్నారంటూ ప్రముఖ ఆయుర్వేద మందుల తయారీ సంస్థ హిమాలయ జనవరి 3న ఘజియాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మురాద్​నగర్​ నుంచి సరఫరా చేస్తూ, అలీగఢ్​లోని స్థానిక దుకాణాల్లో విక్రయిస్తున్నారని అందులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ నకిలీ ట్యాబ్లెట్ల వ్యవహారం భారీ స్థాయిలో కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ ట్యాబ్లెట్స్​ను హర్యానా, ఉత్తరప్రదేశ్​లో అమ్ముతున్నట్లు ఆధారాలు సేకరించారు. అనంతరం వాటి తయారీ ముఠాను సోమవారం అరెస్ట్​ చేశారు.

ఒక్కో బాక్స్​ నకిలీ ట్యాబ్లెట్ల తయారీకి రూ.35 నుంచి రూ.40 వరకు ఖర్చు అవుతుండగా, వాటిని రూ.110 నుంచి రూ.115 వరకు మార్కెట్లో ఈ ముఠా అమ్ముతోంది. అదే అసలైన హిమాలయ లివ్.​52 (Himalaya Liv 52) ట్యాబ్లెట్స్​ బాక్స్​ ధర మార్కెట్​లో రూ.280 ఉందని పోలీసులు తెలిపారు. అధిక లాభాల ఆశ చూపి, స్థాని రిటైల్​ మందుల దుకాణాలను నిందితులు తమ బుట్టలో వేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో సుమారు 50వేల నకిలీ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై ఘజియాబాద్ డీసీపీ తివారీ మాట్లాడుతూ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.

లివ్​ 52 ట్యాబ్లెట్​ ఎందుకు వాడతారంటే..

కాలేయం రక్షణకు ఈ ట్యాబ్లెట్​​ వాడతారు. ముఖ్యంగా కామెర్లు, ఫ్యాటీ లివర్​, ఆల్కహాల్ వల్ల కలిగే కాలేయ సమస్యలకు, ఇతర కాలేయ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

Read Also: డిజిటల్​ అరెస్ట్​ మోసాల్లో ఆ అధికారుల కుట్ర : సుప్రీం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>