కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని భగత్ నగర్‌లో శ్రీ చైతన్య యూత్ క్లబ్ ఆదివారం నిర్వహించిన జీనియస్ ర్యాంకింగ్ చెస్ పోటీలకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచినుంచి 125 మంది చదరంగం క్రీడాకారులు తమ మేధాశక్తిని నిరూపించుకున్నారు. ముఖ్య అతిథిగా చెన్నూరు(రూరల్) సీఐ ఆర్.కృష్ణ, జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య పాల్గొని మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ.. పిల్లలకు చదరంగంతో మేధాశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుందన్నారు.
కంకటి కనకయ్య మాట్లాడుతూ.. పిల్లల ప్రతిభను వెలికి తీయడానికే లక్ష్మీనారాయణ సోలార్ ఎంటర్ప్రైజర్ సహకారంతో ర్యాంకింగ్ చదరంగం పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ సీనియర్ కోచ్ కంకటి అనూప్ కుమార్, లక్ష్మీనారాయణ సోలార్ ఎంటర్ప్రైజెస్ మేనేజర్ శ్రీనివాస్ ఎండి కుమారస్వామి, చైతన్య యూత్ క్లబ్ సభ్యులు పండుగ నాగరాజు, కరీంనగర్ (Karimnagar) జిల్లా డెమొక్రటిక్ డెవలప్మెంట్ కార్యదర్శులు కంకటి సృజన్ కుమార్, తాటిపల్లి సతీష్ బాబు, రాకేష్, చీఫ్ ఆర్బిటర్ తరుణ్, అరుణ్, ఆర్బిటర్లు అభిరామ్, నితిన్, రేవిక్, స్వాతి, ప్రభుదేవా, వరుణ్, విశాల్ , అజయ్ పాల్గొన్నారు.
Read Also: ఘోర విషాదం.. 10 మంది దుర్మరణం!
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

