రైతులను దోచుకుంటున్న కాంగ్రెస్: బీజేపీ నేత కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: ఆరుగాలం రైతులు కష్ట‌ప‌డి పండించిన పంటను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతూ రైతాంగాన్ని ఇబ్బందుల గురి చేస్తుందని, కాంగ్రెస్ సర్కార్ మిల్ల‌ర్ల‌తో కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ చేస్తూ పెద్ద బ్రోకర్‌గా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి (Gandadi Krishna Reddy) ఘాటుగా విమర్శించారు. బుధవారం కొత్తపల్లి మండలంలో పంట కొనుగోలు కేంద్రాలను స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాణ్యమైన ధాన్యాన్ని కూడా కావాలనే ‘బి-గ్రేడ్’గా మారుస్తూ, క్వింటాల్‌కు రూ.20 చొప్పున ధరలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిల్లర్లతో కొమ్మక్కై రైతులను నిలువునా ముంచే కొత్త తరహా దోపిడీకి తెర లేపిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించారని, దీనివల్ల 17 శాతం ఉండాల్సిన తేమ శాతం 11 శాతానికి పడిపోయిందన్నారు. దీని వల్ల రైతులు క్వింటాల్‌కు అదనంగా 7 కిలోల ధాన్యాన్ని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ నిబంధనల కంటే తాలు తక్కువగా ఉన్నప్పటికీ, అధికార పార్టీ అండతో మిల్లర్లు చెలరేగిపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో సంచికి 5 నుంచి 6 కిలోల తరుగు తీసి రైతులకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ కూడా అదే బాటలో ప్రయాణిస్తుందని , అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తున్నందుకు సిగ్గుండాలన్నారు. జిల్లావ్యాప్తంగా పంట కొనుగోలు మందకొడిగాకొనసాగుతున్నాయని , రైతులకు పంటపై ఏలాంటి ఆంక్షలు , కోతలు విధించకుండా పంట కొనుగోళ్ల‌ను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధానంగా ఎలాంటి తాలు, తరుగు కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలకు లారీల సంఖ్యను వెంటనే రెట్టింపు చేయాలని, నాణ్యమైన ధాన్యాన్ని బి-గ్రేడ్ కింద కొంటున్న మిల్లర్లపై, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సివిల్ సప్లై అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, చీటింగ్ కేసులు నమోదు చేయాలనీ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే అకాల వర్షాలతో రైతాంగం పంట నష్టపోకుండా టార్పాలిన్ లను సరఫరా చేయాలని , కాటా చిట్టి ప్రకారమే పేమెంట్ చేయాలని , బి కేటగిరి మోసాలను అరికట్టాలని, రవాణా సౌకర్యం మెరుగుపరచాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుంట తిరుపతి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, సర్పంచులు కోమటిరెడ్డి అంజన్ కుమార్, నునుగొండ మానస ప్రవీణ్, ఉప సర్పంచ్ అరే నరేష్, కట్ల వెంకటేష్, సీనియర్ నాయకులు గుంజేటి శివకుమార్, జవ్వాజి రమేష్, కించ శేఖర్, సోమిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కడార్ల రతన్ కుమార్, కట్ల శ్రీనివాస్, సోమినేని కరుణాకర్, ఇల్లెందుల ఆనంద్, మెరుగు మల్లేశం, బైరెడ్డి వంశీ, కూరగాయల మల్లేశం, పాల శీను, తదితరులతో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>