Mobile Popup Ad
Mobile Popup Ad

‘మీ ప్రేమ నాకు గొప్ప ఆశీర్వాదం’.. ఎన్టీఆర్ ఎమోషనల్‌ పోస్ట్

కలం, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) బర్తే డే సందర్భంగా నిన్న విడుదలైన డ్రాగన్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ గత మూవీల మాదిరే.. రగ్గ్‌డ్ లుక్‌లో ఎన్టీఆర్ గెటప్ చూసి, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఎన్నో సంవత్సరాలుగా నా ప్రయాణంలో అడుగడుగునా మీ ప్రేమ, మద్దతు లభించడం నా జీవితానికి గొప్ప ఆశీర్వాదం లాంటిది. ప్రతి దశలో నా వెంటే ఉంటూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నా. డ్రాగన్ గ్లింప్స్ మాతో పాటు మీకు కూడా మరిచిపోలేని అనుభూతిని తెచ్చిందని భావిస్తున్నా. దీనికి ప్రధాన కారణం డ్రాగన్ అనే కల కన్న నా ప్రశాంత్ నీల్‌‌దే. నాకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, స్నేహితులు, సహచరులు, మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ ప్రేమతో..” అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>