ముల్కలపల్లి పాఠశాలలో నూతన తరగతి గదుల ప్రారంభోత్సవం

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామంలో కీర్తిశేషులు మందడి భూపాల్ రెడ్డి జ్ఞాపకార్థం పునర్ నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన తరగతి గదులను సోమవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan) ప్రారంభించారు. ముందుగా కీ.శే. మందడి భూపాల్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నోట్ పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముల్కలపల్లి గ్రామంలో కీ.శే. మందడి భూపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ పాఠశాల తరగతి గదులను అన్ని హంగులతో పునర్నిర్మించడం అభినందనీయం అని కొనియాడారు. చేతికొచ్చిన కొడుకు చిన్న వయసులోనే మరణించడం ఆ తల్లిదండ్రులకు తీరని లోటు అని, ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. భూపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
​
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోయ రాముడు, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు రమేష్ నాయుడు, లక్ష్మీకాంత్ రెడ్డి, సాయి శ్యామ్ రెడ్డి, యోగి, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, మందడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>